పంచ్ విసిరితే పతకాలే...
కశింకోట : సంకల్పం ఉంటే సాధించలేనిది ఉండదు. ఒకటి కాదు.. రెండు ఆటల్లో ఒకే స్థాయిలో రాణిస్తూ రాష్ట్ర స్థాయిలో పతకాలు సాధించి మరింత ముందుకు దూసుకుపోవడానికి కూడ అఖిల్ ప్రయత్నిస్తున్నాడు. అందరి ప్రశంసలు పొందుతున్నారు. కశింకోటలోని డీపీఎన్ జెడ్పీ హైస్కూలుకు చెందిన అఖిల్ ఇక్కడి బీసీ వసతి గృహంలో ఉంటూ టెన్త్ చదువుతున్నాడు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఈ ఏడాది జిల్లా స్థాయిలో అనకాపల్లిలో నిర్వహించిన జుడో పోటీలో బంగారు పతకాన్ని సాధించి శ్రీకాళహస్తిలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలో వెండి పతకాన్ని పొందాడు. ఈ ఏడాది కుస్తీ పోటీల్లో కూడా సత్తా చూపాడు. జిల్లా స్థాయిలో పాడేరులో నిర్వహించిన పోటీలో ప్రథమంగా నిలిచి బంగారు పతకం సాధించాడు. తద్వారా విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలో వెండి పతకాన్ని కై వసం చేసుకున్నాడు. వచ్చే ఏడాది జాతీయ స్థాయి పోటీలో పాల్గొని బంగారు పతకాలను సాధించాలని ఆకాంక్షిస్తున్నట్టు అఖిల్ ‘సాక్షి’కి తెలిపాడు. ఆటల్లో రాణిస్తూ వైద్యుడు కావాలన్నదే తన లక్ష్యమన్నారు. కుస్తీలో తన మావయ్య నూకరాజు, స్థానిక పీడీ వి.ప్రభాకరరావు వద్ద తర్ఫీదు పొందినట్టు తెలిపాడు. వ్యవసాయ కుటుంబానికి చెందిన అఖిల్‌ది కొయ్యూరు మండలం అంకంపాలెం గ్రామం కాగా, తల్లిదండ్రులు రాజుబాబు, జ్యోతి ఎంతో ప్రోత్సహిస్తున్నట్టు తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment