తుమ్మపాల: జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి కోసం పరిశ్రమల స్థాపనకు అవసరమైన చర్యలను సత్వర మే తీసుకోవాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించా రు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రత్యేక జిల్లా ఇండస్ట్రియల్ ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నూతన పరిశ్రమల స్థాపనకు మౌలిక సదుపాయాల మెరుగు, నిబంధనల క్రమబద్ధీకరణ, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధి విధానం–2024–29, ఎంఎస్‌ఎంఈ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పాలసీ–2024–29, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 2024–29 రూపకల్పన ప్రక్రియ చేపట్టిందన్నారు. పరిశ్రమల స్థాపనతో పాటు భద్రతా చర్యలు కూడా చేపట్టాలన్నారు. జిల్లాలోని పారిశ్రామిక, ఎంఎస్‌ఎంఈ యూనిట్లలోని ఉత్పత్తులను డిజిటల్ కామర్స్ విధానంలో అమ్మకాలు చేపట్టేందుకు ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్‌లో నమోదు చేయాలన్నారు. అనకాపల్లి, నక్కపల్లి, పరవాడలో ఈఎస్‌ఐ ఆస్పత్రుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రధాన మంత్రి ఉద్యోగ కల్పన పథకం కింద యూనిట్ల స్థాపనకు గ్రామీణ పట్టణ ప్రాంతాల యువతను ప్రోత్సహించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment