జోనల్ స్పోర్ట్స్ మీట్‌లో పతకాల పంట
● తెనుగుపూడి గురుకుల విద్యార్థుల ప్రతిభ
దేవరాపల్లి : డా. బీఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాల జోనల్ స్థాయి గేమ్స్, స్పోర్ట్స్ మీట్‌లో ఓవరాల్ చాంపియన్‌ను దేవరాపల్లి మండలం తెనుగుపూడి గురుకుల పాఠశాల విద్యార్థులు సొంతం చేసుకున్నారు. విజయనగరం జిల్లా కొప్పెర్ల గురుకుల పాఠశాలలో ఈ నెల 14 నుండి 16 వరకు జరిగిన జోనల్ స్థాయి క్రీడా పోటీలలో తెనుగుపూడి గురుకుల విద్యార్థులు వివిధ విభాగాలలో 40 మంది సత్తా చాటారని గురుకుల ప్రిన్సిపాల్ పి.రఘు తెలిపారు. సీనియర్స్ ఖోఖో, కబడ్డీలో విన్నర్ గా, హ్యాండ్ బాల్‌లో రన్నర్‌గా నిలిచారు. 400 మీటర్ల రన్నింగ్‌లో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి సిహెచ్. సూర్యకిరణ్ రజత పతకం సాధించాడు. జూనియర్స్‌లో ఖోఖో విన్నర్, వాలీబాల్ రన్నర్‌గాను నిలిచారు. జూనియర్స్ విభాగంలో 100 మీటర్ల రన్నింగ్‌లో టెన్త్ విద్యార్థి ఎస్. గౌరీ మణిశంకర్, వినయ్‌కుమార్ రజతం, కాంస్య పతకాలు సాధించారు. 200 మీటర్ల రన్నింగ్‌లో టెన్త్ విద్యార్థి ఎస్.గౌరీ మణి శంకర్ స్వర్ణ పతకం సాధించాడు. 400 మీటర్ల రన్నింగ్‌లో గౌరీ మణిశంకర్, 8వ తరగతి విద్యార్థి ఆర్.తరుణ్ ప్రథమ, తృతీయ స్థానాల్లో నిలిచారు. 800 మీటర్ల రన్నింగ్‌లో ఆర్.తరుణ్, 1500 మీటర్ల రన్నింగ్‌లో టెన్త్ విద్యార్థి బి.పార్ధు బంగారు పతకాలను సొంతం చేసుకున్నారు. జూనియర్స్ లాంగ్ జంప్, జావెలిన్ త్రోలో టెన్త్ విద్యార్ధి ఎన్. సాయి వరుసగా గోల్డ్, సిల్వర్ మెడల్స్‌ను సాఽధించాడు. జూనియర్స్‌లో 4 ఇంటు 100 మీటర్ల రిలే పరుగు పోటీలో జి. గౌరీ మణిశంకర్, బి.వినయ్, ఆర్.తరుణ్, ఎన్. సాయి బంగారు పతకాలను సాధించారు. విద్యార్థులకు క్రీడల్లో తర్ఫీదునిచ్చిన వ్యాయామ ఉపాధ్యాయులు జి.తరుణేశ్వరరావు, నాగేశ్వరరావులను ప్రిన్సిపాల్ రఘు, స్కూల్ కమిటీ చైర్మన్ నర్సింహమూర్తి, ఉపాధ్యాయులు మంగళవారం ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులతో పాటు పీఈటీలను ఉమ్మడి విశాఖ జిల్లా గురుకులాల కోఆర్డినేటర్ ఎస్.రూపావతి అభినందించినట్టు ప్రిన్సిపాల్ రఘు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment