కె.కోటపాడు: స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని మంగళవారం స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ బాలకృష్ణ, జిల్లా రిజిస్ట్రార్ కె.మన్మధరావు తనిఖీ నిర్వహించారు. కార్యాలయం ద్వారా జరుగుతున్న రిజిస్ట్రేషన్ల వివరాలను వీరు అడిగి తెలుసుకున్నారు. స్టాంపు పత్రాలను నిర్దేశించిన ధరలకు మాత్రమే విక్రయించాలని స్టాంప్ వెండార్లకు సూచించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం డిసెంబర్ 1 నుంచి పెరగనున్న రిజిస్ట్రేషన్ చార్జీలతోపాటు ఇతర అంశాలపై కార్యాలయ సిబ్బందికి జిల్లా రిజిస్ట్రార్ మన్మధరావు పలు సూచనలను చేశారు. కార్యక్రమంలో స్థానిక సబ్ రిజిస్ట్రార్ సత్యనారాయణమూర్తి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment