పూడిమడక రోడ్డు విస్తరణ పనులు వేగవంతం
● అనకాపల్లి ఆర్డీవో ఆయిషా
సర్వేయర్లతో మాట్లాడుతున్న ఆర్డీవో ఆయిషా
మునగపాక: పూడిమడక రోడ్డు విస్తరణ ప్రక్రియ వేగవంతం చేయాలని అనకాపల్లి ఆర్డీవో ఆయిషా కోరారు. మంగళవారం ఆమె స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో విస్తరణకు సంబంధించిన పలు అంశాలపై తహసీల్దార్ ఆదిమహేశ్వరరావుతో చర్చించారు. అనంతరం మునగపాక మెయిన్‌రోడ్డు విస్తరణలో కోల్పోనున్న గృహాలతోపాటు వ్యవసాయ భూములను ఆమె పరిశీలించారు. మునగపాక మండల పరిధిలోని రెవెన్యూకు సంబంధించి సర్వే పనులు పూర్తి చేయాలని సర్వేయర్లను ఆదేశించారు. అలాగే మునగపాక బాధితులకు ఎంత పరిహారం ఖరారు చేశారని అడిగి తెలుసుకున్నారు. సాధ్యమైనంతలో పనులు వేగవంతం చేసి విస్తరణకు అవసరమయ్యే చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment