ఉత్సాహంగా యువజనోత్సవాలు
డాబాగార్డెన్స్ (విశాఖ): జాతీయ స్థాయి యువజనోత్సవాల ఎంపిక పోటీలను మంగళవారం స్థానిక ఏవీఎన్ కళాశాలలో నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ అశోక్ మయూర్ యువజనోత్సవాల పోటీలు ప్రారంభించి మాట్లాడారు. యువత యువజనోత్సవాల్లో పాల్గొని వారిలో నిబిడీకృతమైన కళలను బయటకు తీసుకురావల్సిన అవసరం ఉందన్నారు. నెహ్రూ యువ కేంద్రం జిల్లా అధికారి జి.మహేశ్వరరావు మాట్లాడుతూ సాంస్కృతిక పోటీలు (జానపద కళా రూపాలు), వక్తృత్వ, ఫొటోగ్రఫీ, చిత్రలేఖన పోటీలు నిర్వహించినట్టు చెప్పారు. హైస్కూల్ విద్యార్థులతో సైంటిఫిక్ ఎగ్జిబిషన్ కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లా విద్యాశాఖ అధికారి సహకారంతో వివిధ స్కూళ్ల విద్యార్థుల ద్వారా వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించనున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో ఏవీఎన్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.సింహాద్రినాయుడు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment