వెట్టి చాకిరీ నుంచి విముక్తి కలిగించండి
ఎంపీడీవో కాశీవిశ్వనాథరావుకు వినతిపత్రం అందిస్తున్న వెల్ఫేర్ అసిస్టెంట్లు
కోటవురట్ల: అదనపు బాధ్యతల నుంచి విముక్తి కలిగించాలని సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్లు మొరపెట్టుకున్నారు. ఈమేరకు ఎంపీడీవో కాశీవిశ్వనాథరావుకు మంగళవారం వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ ఐదేళ్లుగా సంక్షేమ సహాయకులుగాను, డిజిటల్ సహాయకులుగానూ పనిచేస్తున్నామని, తమకు సంబంధించిన పనితో పాటు ఇతర శాఖల పనులు కూడా మాపై రుద్ది వెట్టి చాకిరీ చేయిస్తున్నారని వాపోయారు. ప్రతీ సోమ, గురువారాలలో పాఠశాలలకు వెళ్లి టీఎంఎఫ్ ఫొటోలు అప్‌లోడ్ చేయడంతో పాటు ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్ స్కాలర్‌షిప్స్, హౌషింగ్ జిలో ట్యాగింగ్, ఎన్‌పీసీఐ బ్యాంకు లింకింగ్, పింఛన్ల పంపిణీ, బీఎల్‌వో డ్యూటీలు చేయిస్తున్నారని ఆరోపించారు. ఇంజినీరింగ్ అసిస్టెంట్లు చేసే పనిని కూడా మాతోనే చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెల్ఫేర్ అసిస్టెంట్లకు బీఎల్‌వో విధులు అప్పగించవద్దని జీఎస్‌డబ్ల్యూఎస్ డైరెక్టర్ ఆదేశాలు ఉన్నప్పటికీ బేఖాతరు చేస్తూ బీఎల్‌వో విధులు చేయిస్తున్నారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment