ప్రశ్నించేతత్వం లోపించడం వల్లే మహిళలపై అఘాయిత్యాలు
● రూరల్ సీఐ రేవతమ్మ
నర్సీపట్నం: మహిళల్లో ప్రశ్నించే తత్వం లోపించడం వల్లనే అనేక అఘాయిత్యాలు జరుగుతున్నాయని రూరల్ సీఐ ఎల్.రేవతమ్మ అన్నారు. వారోత్సవాల్లో భాగంగా స్థానిక శాఖాగ్రంథాలయంలో నిర్వహించిన మహిళా దినత్సోవంలో సీఐ మాట్లాడారు. జీవితాంతం కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల మాటలు కాదని ఆడపిల్లలు తాత్కాలిక ఆకర్షణకు లోనై జీవితాలను పాడు చేసుకుంటున్నారన్నారు. ఆడపిల్లలు చిన్నప్పుడు తల్లిదండ్రులపై, పెళ్లయిన తర్వాత భర్త మీద, తర్వాత కుమారుల మీద ఆధారపడవలిసిన దుస్థితి ఇప్పటికీ కొనసాగడం దురదృష్టకరమన్నారు. కొంతమంది మహిళలు పదవుల్లోకి వస్తున్నా పురుషుల పెత్తనమే కొనసాగుతోందన్నారు. మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలన్నారు. అనంతరం గ్రంథాలయ అధికారి దమయంతి, మహిళలు సీఐను సత్కరించారు. జనవిజ్ఞాన వేదిక నాయకులు కె.త్రిమూర్తులరెడ్డి, హాస్టల్ వార్డెన్ రాజ్యలక్ష్మి, మర్రిపాలెం డిగ్రీ కళాశాల ఇంగ్లిష్ లెక్చరర్ జి.మేరిపుష్ప పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment