సారా బట్టీలపై దాడులు
● కొరువాడలో 1600 లీటర్ల బెల్లం పులుపు ధ్వంసం
కె.కోటపాడు/చోడవరం రూరల్ : నాటుసారా తయారీపై ముందస్తు సమాచారంతో కొరువాడలో ఎకై ్సజ్ పోలీసులు మంగళవారం దాడులు జరిపారు. చోడవరం ఎకై ్సజ్ సీఐ పాపునాయుడు ఆదేశాల మేరకు ఎస్‌ఐ శేఖరం ఆధ్వర్యంలో గ్రామం శివారు గల ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. తుమ్మ చెరువు పరిసర ప్రాంతాల్లో డ్రమ్ముల్లో నిల్వ ఉంచిన 1600 లీటర్ల బెల్లం పులుపును ఎకై ్సజ్ సిబ్బంది గుర్తించి ధ్వంసం చేశారు. హెడ్ కానిస్టేబుల్ అప్పారావు, సిబ్బంది పాల్గొన్నారు. కాగా సారా తయారీకి ఉపకరిస్తున్న బట్టీలన్నింటినీ కొరువాడ గ్రామానికి చెందిన కక్కల దేవుడు కుమారుడు రాము నిర్వహిస్తున్నట్టు తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని, పూర్తి విచారణ అనంతరం దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని చోడవరం ఎకై ్సజ్ ఇన్‌స్పెక్టర్ కె.వి.పాపునాయుడు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment