రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
నాగభూషణం మృతదేహం
అగనంపూడి: రోడ్డు ప్రమాదంలో చేప ల వ్యాపారి దుర్మరణం చెందాడు. దువ్వాడ పోలీస్టేషన్ పరిధి అగనంపూడి టోల్‌గేటుకు సమీపంలో జరిగిన ప్రమాదానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చీడికాడ గ్రామం ఐటీఐ కాలనీకి చెందిన జనానాగభూషణం (52) చేపల వ్యాపారం చేస్తుంటాడు. గాజువాకలో బంధువుల ఇంట శుభకార్యం ఉండడంతో నాగభూషణం గాజువాక ద్విచక్రవాహనంపై వస్తున్నారు. అగనంపూడి టోల్‌గేటు దాటిన తర్వాత వెనుక నుంచి వచ్చిన లారీ బలంగా ఢీకొంది. ఈ సంఘటనలో తీవ్రంగా పడిన నాగభూషణం అక్కడికక్కడే మృతి చెందాడు.హెల్మెట్ ధరించి ఉన్నప్పటికీ మృత్యు వాత తప్పలేదు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు. మృతుడికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment