తుమ్మపాల : ఈ నెల 25 వరకు మెగా డీఎస్సీ ఉచిత శిక్షణకు దరఖాస్తు గడువు పొడిగించినట్టు శిక్షణ కేంద్రం డైరెక్టర్, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ సాధికారిత అధికారి కె.రాజేశ్వరి ఒక ప్రకటనలో బుధవారం తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ డీఎస్సీకి దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఉచిత శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అర్హులైన అభ్యర్థులు తమ బయోడేటాతో పాటు 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ మార్కుల లిస్టు, టీటీసీ, బీఎడ్, టెట్‌లో అర్హత సాధించిన మార్కుల జాబితా కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం (తల్లిదండ్రుల వార్షిక అదాయం రూ.లక్ష లోపు మాత్రమే), ఆధార్ కార్డు బ్యాంకు పాస్ పుస్తకం, జిరాక్స్, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు జతపరచి అందజేయాలని తెలిపారు. ఎంపికై న అభ్యర్థులకు 2 నెలల పాటు ఉచిత శిక్షణతో పాటు స్టైఫండ్ నెలకు రూ.1500, స్టడీ మెటీరియల్‌కు రూ.1000 చెల్లిస్తారని తెలిపారు. పట్టణంలో రఘురామ కాలనీ, సర్వేపల్లి రాధాకృష్ణన్ జూనియర్ కాలేజీ వీధి, డోర్ నెం.10–06–31/7, అనకాపల్లి, చిరునామాలో గల కార్యాలయానికి నేరుగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మరింత సమాచారం కోసం ఫోన్ నెం: 9885845743 కు సంప్రదించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment