వేధింపులు ఆపండి.. ‘వెలుగు’ చూపండి
మహిళలపై అఘాయిత్యాలు..
ఎన్నాళ్లీ ఘాతుకాలు?
● కొవ్వొత్తులతో ఎస్‌ఎఫ్‌ఐ నిరసన
● సమస్యల పరిష్కారానికి వీవోఏల ఆందోళన
యలమంచిలి రూరల్: కూటమి ప్రభుత్వంలో మహిళలపై అఘాయిత్యాలు, హత్యలు, అత్యాచారాలు పెరిగాయని, దిశా చట్టాన్ని అమలు చేసి వారికి రక్షణ కల్పించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) జిల్లా కార్యదర్శి ఎం.రమణ డిమాండ్ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో యలమంచిలి టౌన్‌లో బుధవారం రాత్రి కొవ్వొత్తులతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ప్రాతినిథ్యం వహిస్తున్న ఉమ్మడి విశాఖ జిల్లాలోనే పరిస్థి తి దారుణంగా ఉందన్నారు. తాజాగా విశాఖలో లా విద్యార్థినిపై సామూహిక లైంగిక దాడి జరగడంతో బాధితురాలు ఆత్మహత్య కు యత్నించిందని, ఈ ఘటన బాధాకరమన్నారు. ఇంతకుముందు రాంబిల్లి మండలం కొప్పుగుండుపాలెంలో ప్రేమోన్మా ది చేతిలో దక్షిత అనే అమ్మాయి హత్యకు గురయ్యిందన్నారు. మహిళలు రక్షణ కల్పించడంలో హోం మంత్రి వంద శాతం ఫె యిలయ్యారని, తక్షణం తమ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు పాల్గొన్నారు.
తుమ్మపాల: తమ సమస్యలను పరిష్కరించాలని, మూడు సంవత్సరాల కాలపరిమితి రద్దు చేయాలని, వేధింపులు ఆపాలని, బకాయివేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ వెలుగు శాఖలో పనిచేస్తున్న వీవోఏలు బుధవారం కలెక్టరేట్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మూడేళ్ల కాలపరిమితి అమలు చేయడం వల్ల 15 ఏళ్లకు పైగా పనిచేస్తున్న వీవోఏల కుటుంబాలు రోడ్డున పడతాయని వాపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వీవోఏలను తొలగిస్తున్నారని దీనిపై ప్రభుత్వం స్పందించాలని కోరారు. నాలుగు నెలలుగా వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. ప్రభుత్వం స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని వారు కోరారు. అంతకుముందు డీఆర్వో బి.దయానిధికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు కె.సూరిబాబు, కోశాధికారి కె.లక్ష్మీ ప్రసన్న, వై.లక్ష్మీరాజేష్, మాణిక్యం, పద్మ, వెంకటలక్ష్మి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment