36,123 గృహాల్లో పశుగణన పూర్తి | - | Sakshi
Sakshi News home page

36,123 గృహాల్లో పశుగణన పూర్తి

Published Thu, Nov 21 2024 1:52 AM | Last Updated on Thu, Nov 21 2024 1:52 AM

36,123 గృహాల్లో పశుగణన పూర్తి

36,123 గృహాల్లో పశుగణన పూర్తి

● వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు పశువుల వివరాలు నమోదు ● జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి రామ్మోహన్‌

అనకాపల్లి: జిల్లాలో పాడి రైతులు 21వ పశుగణనలో తప్పనిసరిగా పశువులను నమోదు చేసుకోవాలని జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి డాక్టర్‌ రామ్మోహన్‌ సూచించారు. మండలంలో తుమ్మపాల, వెంకుపాలెం గ్రామాల్లో పశుగణన సర్వే వివరాలను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకూ జిల్లాలో 36,123 గృహాల్లో పశువుల నమోదు కార్యక్రమం పూర్తి చేశామన్నారు.

వచ్చే ఏడాది ఫిబ్రవరి 28వ తేదీ వరకూ పశుగణన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఈ సర్వే వల్ల పశువులకు సకాలంలో వైద్యం, మందులు, ప్రభుత్వ రాయితీలు పొందవచ్చన్నారు. పశువులు వ్యాధుల బారిన పడినప్పుడు సకాలంలో వైద్య సేవలు అందడమే కాకుండా మృతిచెందిన సమయంలో సకాలంలో బీమా మంజూరుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్థక శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ ఎం.చంద్రశేఖర్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ బి.సౌజన్య, రైతులు, సిబ్బంది పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement