చెరకు రస నాణ్యత పరీక్షలు ప్రారంభం
● గోవాడ సుగర్స్‌లో క్రషింగ్‌కు చకచకా ఏర్పాట్లు
చోడవరం: ఈ ఏడాది క్రషింగ్ సీజన్‌కు గోవాడ సుగ ర్ ఫ్యాక్టరీ సర్వం సిద్ధం చేసింది. మరో 20 రోజుల్లో క్రషింగ్ ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. ముందుగా ఓవరాయిలింగ్ జరిగిన యంత్రాల పనితీరుపై ట్రయల్ రన్ పనులు చేపట్టారు. బుధవారం చెరకు నాణ్యత పరీక్షలను ప్రారంభించారు. చెరకు తోటల్లో పక్వానికి వచ్చిన పంటకు రసనాణ్యత పరీ క్ష చేసిన తర్వాత కటింగ్ పర్మిట్లు ఇస్తారు. ముందు గా చెరకు గడల రస నాణ్యత పరీక్షలు విస్తృతంగా చేయాల్సి ఉండటంతో ఆ పరీక్షలను ఫ్యాక్టరీ మేనేజింగ్ డైరెక్టర్ వి.వి.సన్యాసినాయుడు ప్రారంభించారు. ఈ ఏడాది క్రషింగ్ సీజన్‌ను డిసెంబరు రెండో వారంలో లాంఛనంగా ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే క్రషింగ్ ప్రారంభించే సమయానికి రోజుకు కనీసం 1000 నుంచి 2000 టన్నుల చెరకు ఫ్యాక్టరీకి సరఫరా కావాల్సి ఉంది. రెగ్యులర్ క్రషింగ్ జోరందుకుంటే రోజుకు 3 వేల నుంచి 4 వేల టన్నుల వరకు చెరకు అవసరమవుతుంది. ఈ పరిస్థితుల్లో ఇప్పటి నుంచే ఫ్యాక్టరీ పరిధిలో ఉన్న చెరకుకు రసనాణ్యత పరీక్షలు చేసి కటింగ్ పర్మిట్లు ఇవ్వాలని ఫీల్డ్ సిబ్బందికి యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. పక్వానికి వచ్చిన తోటలను వ్యవసాయ ఫీల్డ్ సిబ్బంది గుర్తించి రసనాణ్యత పరీక్షలకు తరలించే పనులకు శ్రీకారం చుట్టామని ఎండీ తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment