కంప్యూటరీకరణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
● సహకార సంఘాల సభ్యుల వివరాలు 22లోగా అప్‌లోడ్ చేయాలి ● సమీక్ష సమావేశంలో కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశం
సహకార శాఖ, ఆప్కాబ్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న కలెక్టర్ విజయ కృష్ణన్
తుమ్మపాల: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా ల కంప్యూటరీకరణ పనులను వెంటనే పూర్తి చేయాల ని కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కోఆపరేటివ్, డీసీసీబీ, ఆప్కాబ్ అధికారులతో సమావేశం నిర్వహంచి కంప్యూటరీకరణ పనుల పురోగతిని సమీక్షించారు. కంప్యూటరీకరణ పనులు పూర్తిచేయకపోవడం, రాష్ట్ర స్థాయి సూచీలలో జిల్లా వెనుకబడటంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. కంప్యూటరీకరణ పనులలో నిర్లక్యం వహించే అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సహకార సంఘాల సభ్యుల పూర్తి వివరాలు సేకరించి కంప్యూటరీకరించాలన్నారు. డేటా సేకరణ, అప్‌లోడ్ పనులను ఈనెల 22 నాటికి పూర్తిచేయాలన్నారు. సహకార శాఖ జిల్లా అధికారి ఎ.ప్రేమ స్వరూపరాణి, జిల్లా కోఆపరేటివ్ అకౌంట్స్ అధికారి జి.గోవిందరావు, డీసీసీబీ సీఈవో వర్మ, ఆప్కాబ్ డీపీడీఎం రాజు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment