విపత్తుల్లో అప్రమత్తం
● ఎన్‌డీఆర్‌ఎఫ్ 10వ బెటాలియన్ కమాండర్ సత్యనారాయణ
నక్కపల్లి : ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు సమయస్ఫూర్తిగా వ్యవహరించి సహాయక కార్యక్రమాలు నిర్వహించాలని జాతీయ విపత్తు స్పందన దళం(ఎన్‌డీఆర్‌ఎఫ్) 10 బెటాలియన్ కమాండర్ వై. సత్యనారాయణ తెలిపారు. శనివారం విపత్తులు, ప్రమాదాలు సంభవించిన సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సహాయక చర్యలపై జూనియర్ కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పదో బెటాలియన్ కమాండెంట్ వి.వి.ఎస్ ప్రసన్నకుమార్, జిల్లా కలెక్టర్ విజయ్‌కృష్ణన్ ఆదేశాల మేరకు ఈనెల 11 నుంచి 27 వరకు కోస్తా తీర మండలాల్లో గల గ్రామాలు, పాఠశాలల్లో, పరిశ్రమల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కమ్యూనిటీ అవేర్‌నెస్ కార్యక్రమం ద్వారా ప్రమాదాలు జరిగినపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విపత్తు నివారణ, ఉరుములు, మెరుపు, దుమ్ము , వడగండ్లు, కుంభవృష్టి , బలమైన ఈదురు గాలులు వీచినపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శిక్షణ ఇస్తున్నట్టు సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు నిర్వహించిన పలు డెమోలు విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు. విపత్తుల సమయంలో తీసుకునే చర్యలపై స్థానికులతో మాక్ డ్రిల్ నిర్వహించారు. కార్యక్రమంలో తహసీల్దార్ నర్సింహమూర్తి, ఎంపీపీ రత్నం, వైస్ ఎంపీపీ నానాజీ, మండల టీడీపీ అధ్యక్షుడు వెంకటేష్, డీటీ అన్నాజీరావు, ఆర్‌ఐ కన్నబాబు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment