పెత్తనం!
● స్థానిక నేతలకు సంబంధం లేకుండా అమరావతి నుంచే ఆదేశాలు ● ముఖ్యనేతతో పాటు మైనింగ్ మంత్రి హస్తం ● ప్రభుత్వ ఇసుక డిపోలస్థానంలో ప్రైవేటు డిపోలు ● విశాఖలో 3, అనకాపల్లిలో 6 ప్రాంతాల్లో ఏర్పాటు
ప్రైవేటు ఇసుక డిపోల కోసం పిలిచిన టెండర్లకు దరఖాస్తుతో పాటు ఇసుక డిపో ఏర్పాటు చేసే ప్రాంతానికి సంబంధించిన ఎన్‌వోసీ సమర్పించాల్సి ఉంటుంది. అయితే గాజువాక ఇసుక డిపో వ్యవహారంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారం నడిచిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గాజువాకలో ప్రైవేటు ఇసుక డిపో ఏర్పాటు కోసం నాగేంద్ర ఇన్ఫ్రా సంస్థ ఎన్‌వోసీకి ఈనెల 12వ తేదీన దరఖాస్తు చేసుకుంది. ఆ సమయంలో స్థలం లీజు అగ్రిమెంట్ డాక్యుమెంట్ ఇవ్వలేదు. సదరు రైతుతో సంస్థ 14వ తేదీన లీజు అగ్రిమెంటు చేసుకుంది. అదే రోజున ఆగమేఘాల మీద ఎన్‌వోసీ జారీ చేయడంతో పాటు సదరు తహసీల్దార్ సెలవులో ఉండటంతో డిప్యూటీ తహసీల్దార్‌తో పనికానిచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఇసుక డిపో నగరానికి వెలుపల భారీ లారీలు రాకపోకలు సాగించేందుకు వీలుగా ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ మాత్రం జనావాసాలు, సినిమా థియేటర్లు ఉండటంతో పాటు లారీలు వెళ్లేందుకు రెండు భారీ ట్రాఫిక్ సిగ్నల్స్ దాటి వెళ్లాల్సి ఉంది. అంటే పగలు సమయాల్లో ఇసుక లారీల రాకపోకల వల్ల ఈ ప్రాంతంలో మరింతగా రద్దీ పెరగనుంది. త ద్వారా ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడతాయి. ఇవేవి పట్టించుకోకపోవడం వెనుక సదరు శా ఖ మంత్రితో పాటు విజయవాడ నుంచే మొ త్తం వ్యవహారం చక్రం తిప్పినట్టు తెలుస్తోంది.
దరఖాస్తుతో ఎన్‌వోసీ ఇవ్వకపోయినా..!
Comments
Please login to add a commentAdd a comment