జోనల్‌స్థాయి పోటీల్లో గురుకుల విద్యార్థుల సత్తా
జోనల్ అధికారుల చేతుల మీదుగా పతకాలు అందుకుంటున్న పీడీ సావిత్రిదేవి, విద్యార్థులు
నర్సీపట్నం: శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల గురుకుల పాఠశాలలో ఈ నెల 14 నుంచి 17 వరకు జరిగిన జోనల్‌స్థాయి ఆటల పోటీల్లో నర్సీపట్నం డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాల విద్యార్థు లు ప్రతిభకనబరిచి గేమ్స్‌చాంపియన్‌షిప్ సాధించారు. పాఠశాల నుంచి జోనల్‌స్థాయి క్రీడా పోటీల్లో 40మంది విద్యార్థులు పాల్గొన్నారు. సీనియర్ విభాగం త్రోబాల్‌లో ప్రథమస్థానం, వాలీబాల్‌లో ద్వితీయస్థానం, జూనియర్స్ విభా గం వాలీబాల్‌లో ద్వితీయస్థానం సాధించారు. ఎంపీసీ మొదటి సంవత్సరం విద్యార్థిని ఎస్.సునీత సీనియర్ విభాగంలో 100 మీటర్ల పరుగుపందెంలో స్వర్ణం, 200 మీటర్ల పరుగుపందెంలో కాంస్య, లాంగ్ జంప్‌లో రజత పతకం సాధించింది. జూనియర్స్ విభాగం 400 మీటర్ల రన్నింగ్‌లో 8వ తరగతి చదువుతున్న కె.హరిణి స్వర్ణం, ఎస్.గోపీమాధురి రజత పతకం సాధించారు. 200 మీటర్ల రన్నింగ్‌లో ఎస్.గోపిమాధురి కాంస్య పతకం సాధించింది, 1500 మీటర్ల పరుగుపోటీలో ఎస్.దేవి కాంస్య పతకం, 800 మీటర్లలో సీహెచ్.స్వర్ణ.. కాంస్య పతకం కై వసం చేసుకున్నా రు. పతకాలు సాధించిన విద్యార్థులను, పీడీ ఎన్.సావిత్రిదేవి, పీఈటీ కె.మల్లమ్మను ప్రిన్సిపాల్ ఎ.రాజేశ్వరి, ఉపాధ్యాయులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment