ఉచిత సేవలను సద్వినియోగం చేసుకోండి
ఖైదీలతో మాట్లాడుతున్న సీనియర్ సివిల్ జడ్జి పఠాన్ షీయాజ్ ఖాన్
నర్సీపట్నం: న్యాయ సేవాధికార సంస్థ అందిస్తున్న ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, సీనియర్ సివిల్ జడ్జి పఠాన్ షీయాజ్ ఖాన్ తెలిపారు. స్థానిక సబ్‌జైల్‌ను శనివారం సందర్శించారు. జైల్‌లో ఖైదీలకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం ఖైదీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెయిల్ పెట్టుకునేందుకు ఆర్థికస్థోమత లేని వారికి ఉచితంగా న్యాయవాదిని నియమిస్తామన్నారు. అటువంటి వారు ఎవరైనా ఉంటే జైలు సూపరింటెండెంట్‌కు వివరాలు అందించాలని తెలిపారు. అనంతరం శిథిలావస్థలో ఉన్న న్యాయాధికారి నివాస భవనం, కోర్టు సముదాయాలను ఆయన పరిశీలించారు. ఆ సమయంలో కొంత మంది వ్యక్తులు ఆ భవనాల్లో ఉండటాన్ని జడ్జి గమ నించారు. ఇకపై ప్రైవేట్ వ్యక్తులు భవన సముదాయ ప్రాంతంలో సంచరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. జడ్జి వెంట న్యాయ వాదులు గోవిందరావు, గోవర్ధన్‌గిరి అప్పలనాయుడు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment