మహారాణిపేట (విశాఖ): పిల్లల బంగారు భవిష్యత్తు కోసం – బడి వైపు ఒక అడుగు అనే నినాదంతో నిర్వహించనున్న మెగా పేరెంట్ టీచర్స్ సమావేశాలు విజయవంతం చేయాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ పిలుపునిచ్చారు. డిసెంబర్ 7న జరిగే మెగా పేరెంట్ టీచర్స్ సమావేశంపై జిల్లా విద్యాశాఖ అధికారులతో శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో 11 మండలాల పరిధిలోని ఉన్న 595 ప్రభుత్వ పాఠశాల్లో పీటీఎం సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమం నిర్వహణ ద్వారా పాఠశాలలు, తల్లిదండ్రుల మధ్య బంధాన్ని బలోపేతం చేయడానికి అవకాశం ఉందని తెలిపారు. పోషకాహారం, పిల్లల భద్రత అంశాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment