ఛత్తీస్‌గఢ్‌ను గెలిపించిన శశాంక్
● మరో మ్యాచ్‌లో చండీగఢ్‌పై అసోం విజయం
విశాఖ స్పోర్ట్స్: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ గ్రూప్ డీ పోటీల్లో భాగంగా బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో రైల్వేస్‌పై ఛత్తీస్‌గఢ్ మరో బంతి ఉండగా మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. డేనైట్‌గా జరిగిన మరో మ్యాచ్‌లో అసోం జట్టు చండీగఢ్‌పై గెలుపొందింది. దీంతో గ్రూప్ డీలో ఎనిమిదేసి పాయింట్లతో అసోం, చండీగఢ్, విదర్భ ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి స్టేడియంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రైల్వేస్ జట్టు ఐదు వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. కెప్టెన్ ఉపేంద్ర(68), అశుతోష్(59) అర్ధసెంచరీలతో రాణించారు. ప్రతిగా బ్యాటింగ్‌కు దిగిన ఛత్తీస్‌గఢ్ ఏడు వికెట్లు కోల్పోయి మరో బంతి ఉండగా విజయలక్ష్యాన్నందుకుంది. కీపర్ బ్యాటర్ శశాంక్ 57 పరుగులు చేసి.. మ్యాచ్ బెస్ట్‌గా నిలిచాడు. మరో మ్యాచ్‌లో టాస్ గెలిచిన చండీగఢ్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో అసోం తొలుత బ్యాటింగ్ చేసింది. 19.1 ఓవర్లలోనే 150 పరుగులకు ఆలౌటైంది. సాహిల్ (51) అర్ధసెంచరీ నమోదు చేశాడు. ప్రతిగా బ్యాటింగ్ చేసిన చండీగఢ్ 19.1 ఓవర్లలో 139 పరుగులు చేసి ఓటమి పాలైంది.
Comments
Please login to add a commentAdd a comment