ముగిసిన గిరిజన స్వాభిమాన ఉత్సవాలు
ఏయూక్యాంపస్(విశాఖ): గిరిజన స్వాభిమాన ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. జనజాతి గౌరవ్ దివస్ వేడుకల్లో భాగంగా గిరిజన సంక్షేమ శాఖ, టీజీఆర్–టీఎం, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహకారంతో ఈ నెల 15 నుంచి 26 వరకు గ్రామ, పంచాయతీ, ఐటీడీఏ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో జనజాతి గౌరవ్ దివస్ నిర్వహించారు. గిరిజన స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకోవడం, సాంస్కృతిక వారసత్వాన్ని నేటి తరానికి తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాలను జరిపారు. స్వాభిమాన ఉత్సవాల్లో భాగంగా గిరిజన సంత, రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు చిత్రలేఖనం, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. రుషికొండ వద్ద ఏర్పాటుచేసిన గిరిజన సంత, బీచ్‌రోడ్డులో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్స్‌లో గిరిజన ఉత్పత్తులు విక్రయాలు జరిపారు. ఈ కార్యక్రమాలలో ఎనిమిది ఐటీడీఏలు, 17 జిల్లాల నుంచి వెయ్యి మందికిపైగా విద్యార్థులు, సాంస్కృతిక బృందాలు పాల్గొన్నాయి. రాష్ట్ర స్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి పాడేరు ఐటీఏడీ ప్రాజెక్టు అధికారి అభిషేక్ బహుమతులను ప్రదానం చేశారు. పోటీల్లో ప్రథమ స్థానాన్ని సీతంపేట, రెండో స్థానం పాడేరు ఐటీడీఏలు కై వసం చేసుకున్నాయి. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ రాణి మంద, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment