విశాఖలో పర్యాటక కేంద్రాల అభివృద్ధి కోసం వీఎంఆర్డీఏ పలు ఆహ్లాద, వినోద, క్రీడా, పర్యాటక ప్రాజెక్టులకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఐదు నెలలు దాటినప్పటికీ.. ఇప్పటి వరకు వాటిపై కదలిక లేకుండా పోయింది. గత ప్రభుత్వ హయాంలో రూపొందించిన అన్ని ప్రాజెక్టులను నిలిపివేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి అధికారులు మౌఖిక ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. దీంతో డీపీఆర్‌లు సైతం సిద్ధమైన కీలక ప్రాజెక్టుల భవితవ్యం అయోమయంగా మారింది.
● రూ.40కోట్ల అంచనా వ్యయంతో పీపీపీ పద్ధతిలో అమ్యూజ్‌మెంట్, గేమింగ్, ఫన్, స్కేటింగ్, అక్వేరియం.. ఇలా అన్ని రకాల ఆహ్లాద, వినోద కేంద్రాలు ఒకే చోట విశాఖ ప్రజలను అలరించేలా ప్రణాళికలు రూపొందించింది. పోలీస్ బ్యారెక్స్ సమీపంలో వైశాఖీ జల ఉద్యానవనం స్థలంలో ‘అర్బన్ ఎంటర్‌టైన్‌మెంట్, ఫన్ జోన్’కు ఇప్పటికే ఆసక్తి వ్యక్తీకరణకు వీఎంఆర్డీఏ బిడ్లు సైతం ఆహ్వానించింది.
● కాపులుప్పాడ ప్రాంతంలో నేచురల్ హిస్టరీ పార్కు అభివృద్ధికి డీపీఆర్ సిద్ధం చేసింది.
● గ్లాస్ బ్రిడ్జిపై నడుస్తూ సముద్ర అందాలను ఆస్వాదించేలా రూ.7.8 కోట్లతో ఓ ప్రాజెక్ట్ రూపొందించింది. వీఎంఆర్డీఏ పార్క్‌కు ఆగ్నేయంగా సముద్రం ఒడ్డు నుంచి సముద్రం లోపలకు 91 మీటర్ల పొడవుతో ఓషన్ డెక్ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్(ఏపీయూఐఏఎంఎల్) డిజైన్ సిద్ధం చేసింది. సీఆర్‌జెడ్ అనుమతులు వచ్చిన వెంటనే నిర్మాణ పనులు చేపట్టాలని భావించింది.
● కై లాసగిరిపై రూ.4.69 కోట్లతో సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యూజియం నిర్మాణానికి వీఎంఆర్డీఏ అధికారులు పంపించిన ప్రతిపాదనలకు గత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
● రూ.18 కోట్లతో కై లాసగిరిపై కాటేజీలు, రివాల్వింగ్ రెస్టారెంట్ ప్రాజెక్టు పనులను తిరిగి చేపట్టేందుకు అనుమతులు మంజూరు చేసింది.
ఇలా మరికొన్ని పర్యాటక ప్రాజెక్టులకు వీఎంఆర్డీఏ అధికారులు ప్రణాళికలు రూపొందించారు.
Comments
Please login to add a commentAdd a comment