20 కేజీల గంజాయితో ఇద్దరి అరెస్ట్
చోడవరం రూరల్: మరో రాష్ట్రానికి తరలించడానికి 20 కేజీల గంజాయితో స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బస్సు కోసం ఎదురుచూస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలిలా ఉన్నాయి. ఒడిశా రాష్ట్రం నుంచి 20 కేజీల గంజాయిని హర్యానా రాష్ట్రానికి తరలించడంలో భాగంగా చోడవరం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఎదురు చూస్తున్న ఇద్దరిని బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న బ్యాగులను తనిఖీ చేయగా.. 20 కేజీల గంజాయి బయటపడింది. నిందితులను అరెస్ట్ చేసి, గంజాయితో పాటు రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment