పెందుర్తి: స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలోని గవర జగ్గయ్యపాలెంలో నిల్వ ఉంచిన హాష్ ఆయిల్(లిక్విడ్ గంజాయి)ను పెందుర్తి పోలీసులు, నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. సీఐ కె.వి.సతీష్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం భీమలాపల్లికి చెందిన ఉలంగి రామన్న, పాడేరుకు చెందిన కూడా రవిశంకర్, జీకే వీధి మండలం వంచుల చీరపల్లి గ్రామానికి చెందిన బోనంగి చంటిబాబులు కలిసి హాష్ ఆయిల్ సరఫరా చేస్తుంటారు. ఈ క్రమంలో ఏజెన్సీ నుంచి నగరానికి 10 కిలోల హాష్ ఆయిల్‌ను తరలిస్తుండగా టాస్క్‌ఫోర్స్ పోలీసులతో కలిసి పెందుర్తి పోలీసులు పట్టుకున్నట్లు సీఐ తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment