సిబ్బందిని అభినందిస్తున్న ఎస్పీ అన్బురాజన్
రాప్తాడురూరల్: సమగ్రశిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ (ఏపీసీ)గా జిల్లా విద్యాశాఖ అధికారి వి.నాగరాజుకు ఎఫ్‌ఏసీ బాధ్యతలు అప్పగిస్తూ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ (ఎస్‌పీడీ) బి.శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో గురువారం ఆయన బాధ్యతలు స్వీకరించారు.
రైల్లో ప్రయాణికురాలి అదృశ్యం
అనంతపురం సిటీ: షోలాపూర్–హాసన్ మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న బెంగళూరుకు చెందిన ఏడు పదుల వయసున్న వృద్ధురాలు పూలబాయి తవార్ రాథోడ్ అదృశ్యమయ్యారు. షోలాపూర్ నుంచి బెంగళూరుకు మనవడు శివకుమార్‌తో కలసి బుధవారం రాత్రి ఆమె బయలుదేరారు. గురువారం తెల్లవారుజామున 1.51 నుంచి 2.15 గంటల మధ్య రైలు గుంతకల్లుకు రెండు కిలోమీటర్ల దూరంలో ఆపారు. ఆ సమయంలో పూలబాయి ఉన్నారు. ఆ తర్వాత మనువడు నిద్రలోకి జారుకున్నాడు. రైలు ధర్మవరం స్టేషన్ దాటాక మేల్కోని చూస్తూ ఆమె కనిపించలేదు. మధ్యలో స్టాపింగులు లేకపోవడంతో బెంగళూరులో రైలు దిగి, ద్విచక్ర వాహనంపై వెంటనే ధర్మవరం, అనంతపురం రైల్వేస్టేషన్లకు చేరుకుని ఆమె ఆచూకీ కోసం ఆరా తీశాడు. ఫలితం లేకపోవడంతో అనంతపురం జీఆర్పీ ఎస్‌ఐ విజయ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో సీసీ కెమెరా ఫుటేజీలను రైల్వే పోలీసులు పరిశీలిస్తున్నారు.
పోక్సో కేసు దర్యాప్తులో
సిబ్బంది పనితీరు భేష్ : ఎస్పీ
అనంతపురం క్రైం: పోక్సో కేసు దర్యాప్తులో మెరుగైన పనితీరు కనబరిచి ముద్దాయికి జీవిత ఖైదు పడేలా చేసిన సిబ్బందిని ఎస్పీ అన్బురాజన్ అభినందించారు. 2018లో ఆత్మకూరు పోలీసు స్టేషన్‌లో నమోదైన పోక్సో కేసులో ఎగ్గిడి నాగరాజు అలియాస్ లొడ్డ నాగరాజుకు జీవిత ఖైదు, రూ.5వేలు జరిమానా, బాధితురాలికి రూ.3లక్షల పరిహారం చెల్లించాలని న్యాయస్థానం తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ముద్దాయికి శిక్షపడేలా వాదనలు వినిపించిన స్పెషల్ పీపీ విద్యాపతి, పక్కా ఆధారాలతో నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టిన ఏఎస్‌ఐ శ్రీనివాసులు, హెచ్‌సీ శ్రీనివాసులు, కానిస్టేబుల్ షెక్షావలిని అభినందిస్తూ సత్కరించారు. కార్యక్రమంలో లీగల్ అడ్వయిజర్ విష్ణువర్ధన్ రెడ్డి, ఎస్‌బీ, డీసీఆర్‌బీ సీఐలు జాకీర్ హుస్సేన్, విశ్వనాథచౌదరి పాల్గొన్నారు.
సీసీ కెమెరాలతో పక్కాగా నిఘా
జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో నిర్వహిస్తున్న పోలీస్ కంట్రోల్ రూం, డయల్ 100, సైబర్ క్రైం తదితర విభాగాలను గురువారం ఎస్పీ అన్బురాజన్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని పట్టణాల్లోని సీసీ కెమెరాలను జిల్లా పోలీస్ కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానం చేస్తున్నట్లు తెలిపారు. నగరంతో పాటు తాడిపత్రి, రాయదుర్గం, కళ్యాణదుర్గం, పామిడి, గుత్తి మున్సిపల్ పట్టణాల్లోని శివారు ప్రాంతాలు, అవుటర్ రింగ్ రోడ్లు సైతం కవర్ అయ్యేలా కెమెరాలను సిద్ధం చేసి బైక్ రేసింగ్‌లపై నిఘా పెంచనున్నట్లు పేర్కొన్నారు. రక్షక్, బ్లూకోల్ట్స్, హైవే పెట్రోలింగ్ విభాగాలను బలోపేతం చేస్తున్నామన్నారు. పోలీస్ కంట్రోల్ రూం ిసీఐ దేవానంద్, టెక్నికల్ ఎస్‌ఐ సుధాకర్‌యాదవ్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment