బాలలు... ప్రతిభావంతులు
చదరంగంలో చిచ్చరపిడుగు
పిల్లలే.. కానీ, తమకంటే వయసులో పెద్దవారి కంటే గొప్ప విజయాలు సాధించారు. బడికెళ్లే వయసులోనే వీళ్లు తమ ఆలోచనలకు పదునుపెట్టారు. అనూహ్యమైన విజయాలను సొంతం చేసుకుంటున్నారు. అలాంటి చిన్నారుల్లో ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పే బాలల దినోత్సవం రానే వచ్చింది. ఏటా నవంబర్ 14న దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని బాలల దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో గురువారం చాచా నెహ్రూ జయంతిని చిన్నారుల సృజన నడుమ ఘనంగా నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో చిరుప్రాయంలోనే అనూహ్యమైన విజయాలను సొంతం చేసుకున్న చిన్నారుల్లోని ప్రతిభపై ‘సాక్షి’ కథనం. – అనంతపురం కల్చరల్
అనంతపురం నగరానికి చెందిన కీర్తి, కాశి రవీంద్ర దంపతుల కుమార్తె శమిక... ఏడేళ్ల ప్రాయంలోనే చెస్‌లో రాణిస్తోంది. ఇటీవల విజయవాడలో జరిగిన అంతర్జాతీయ చెస్ పోటీల్లో మూడు దేశాలకు చెందిన 508 మంది క్రీడాకారులు క్లాసికల్ విభాగంలో, 528 మంది క్రీడాకారులు ర్యాపిడ్ విభాగంలో పాల్గొన్నారు. ఈ పోటీల్లో పాల్గొన్న శమిక... క్లాసికల్ విభాగంలో ఐదో స్థానం, ర్యాపిడ్ విభాగంలో 4వ స్థానం దక్కించుకుని ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్‌లో 1300 ర్యాంకును కై వసం చేసుకుంది. అలాగే బ్లిట్జ్ విభాగంలో రెండో స్థానం దక్కించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment