పోలీసుల అదుపులో సోషల్ మీడియా యాక్టివిస్టు
రాయదుర్గం: సోషల్ మీడియా యాక్టివిస్టులపై ప్రభుత్వ వేధింపులు కొనసాగుతున్నాయి. తాజాగా బుధవారం రాయదుర్గం మండలం ఆయతపల్లికి చెందిన ప్రసాద్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐదుగురు మఫ్టీలో వెళ్లి ఇంట్లో ఉన్న ప్రసాద్‌రెడ్డిని చుట్టుముట్టారు. సీఐ పిలుస్తున్నారంటూ పోలీస్‌స్టేషన్‌కు రమ్మన్నారు. కారణం చెప్పాలని కుటుంబ సభ్యులు పట్టుబట్టినా ఏమీ చెప్పకుండా ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని రాయదుర్గం అర్బన్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. దీంతో తండ్రి బ్రహ్మానందరెడ్డి అర్బన్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. తన కుమారుణ్ని ఎందుకు తీసుకొచ్చారో చెప్పాలంటూ పోలీసులను వేడుకున్నాడు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో విచారిస్తున్నామని, విచారణ తర్వాత పంపిస్తామని చెప్పారు. అయితే అతన్ని చూపడానికి నిరాకరించారు. తన కుమారుణ్ని ఇక్కడే ఉంచారా ? లేక మరెక్కడికై నా తీసుకెళ్లారో అర్థం కావడం లేదని తండ్రి ఆందోళన వ్యక్తం చేశాడు. నెల క్రితమే కుమారుడి వివాహమైందని, కోడలు లావణ్య, తల్లి ఉమాదేవి కన్నీటి పర్యంతం అవుతున్నారని తెలిపాడు. తన కుమారుణ్ని వదిలే వరకు ఇక్కడే ఉంటానని చెప్పాడు. ఈ విషయంపై సీఐ జయనాయక్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా.. సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టడంతో విచారిస్తున్నామని చెప్పారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులా?
విచారణ పేరుతో సోషల్‌మీడియా యాక్టివిస్టులను అదుపులోకి తీసుకోవడం, కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేయడం తగదని వైఎస్సార్‌సీపీ రాయదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డి, రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌని ఉపేంద్రారెడ్డి అన్నారు. ప్రసాద్‌రెడ్డిని అదుపులోకి తీసుకోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారన్నారు. సీఐకు ఫోన్ చేస్తే రాత్రి తొమ్మిది గంటల తర్వాత పంపిస్తామని చెప్పారన్నారు. ప్రభుత్వ ఒత్తిడి మేరకు అమాయకులను కేసుల్లో ఇరికించాలని చూస్తే సీరియస్‌గా పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించారు.
మఫ్టీలో వచ్చి తీసుకెళ్లిన పోలీసులు
విచారణ పేరుతో కాలయాపన
స్టేషన్ వద్దే తండ్రి పడిగాపులు
ఎక్కడికి తీసుకెళ్లారో తెలియడం లేదని ఆందోళన
Comments
Please login to add a commentAdd a comment