జిల్లా అంతటా బుధవారం ఉష్ణోగ్రతలు తగ్గాయి. చలి వాతావరణం
క్రీడలతో మానసికోల్లాసం
బుక్కరాయసముద్రం: క్రీడలు మానసికోల్లాసాన్ని కలిగిస్తాయని ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్ ప్రభుకుమార్ అన్నారు. మండలంలోని జంతలూరు వద్ద ఉన్న ఏపీఎస్పీ 14వ బెటాలియన్‌లో 3వ క్రీడా మహోత్సవ్–2024 ముగింపు కార్యక్రమం బుధవారం నిర్వహించారు. కార్యక్రమానికి కమాండెంట్ ప్రభుకుమార్, జేఎన్‌టీయూ స్పోర్ట్స్ అధికారి జోజిరెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మానసిక ఒత్తిడి తగ్గించడంలో క్రీడలు ఎంతో ఉపయోగ పడతాయన్నారు. ఉద్యోగులకు స్పోర్ట్స్ మీట్ నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం వివిధ క్రీడల్లో ప్రతిభ కనబరిచిన బెటాలియన్ పోలీసు జట్లను అభినందిస్తూ అవార్డులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో అడిషనల్ కమాండెంట్ కేశవరెడ్డి డీఎస్పీ ప్రసాద్‌రెడ్డి, ఆర్‌ఐలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
‘కదిరిదేవరపల్లి–గుంతకల్లు’ మధ్య రైలు రాకపోకలు రద్దు
గుంతకల్లు: కదిరిదేవరపల్లి–గుంతకల్లు మార్గంలో రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ అఫీసర్ శ్రీధర్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. రాయదుర్గం–కదిరిదేవరపల్లి మధ్య జరుగుతున్న రైలు మార్గం అభివృద్ధి పనుల్లో భాగంగా రాకపోకలను నిలిపివేసినట్లు పేర్కొన్నారు. ఇకపై ‘కదిరిదేవరపల్లి–తిరుపతి’ ప్యాసింజర్ రైలు గుంతకల్లు–తిరుపతి మధ్య మాత్రమే నడుస్తుందన్నారు. తిరుపతి–గుంతకల్లు మధ్య (07589) ప్యాసింజర్ రైలు డిసెంబర్ 31వ తేదీ వరకు నడుస్తుందన్నారు. అదేవిధంగా గుంతకల్లు–తిరుపతి మధ్య (07590) ప్యాసింజర్ రైలు 2025 జనవరి 1వ తేదీ వరకు నడుస్తుందన్నారు. అభివృద్ధి పనుల అనంతరం ప్యాసింజర్ రైళ్లు యఽథా విధిగా నడుస్తాయని, ప్రయాణికులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment