ఫోన్‌పే ద్వారా నగదు అపహరణ.. యువకుడికి దేహశుద్ధి | - | Sakshi
Sakshi News home page

ఫోన్‌పే ద్వారా నగదు అపహరణ.. యువకుడికి దేహశుద్ధి

Published Thu, Nov 28 2024 1:13 AM | Last Updated on Thu, Nov 28 2024 1:13 AM

-

గుత్తి: ఇతరుల ఫోన్‌పే ఖాతా నుంచి తన ఖాతాకు గుట్టు చప్పుడు కాకుండా రూ.వేలు బదలాయించుకున్న యువకుడిని స్థానికులు గుర్తించి దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు. వివరాలు... నంద్యాల జిల్లా ప్యాపిలికి చెందిన రాజు బుధవారం గుత్తిలోని బంధువుల ఇంటికి వచ్చాడు. స్థానికంగా ఓ హోటల్‌లో పనిచేస్తున్న తన బావమరిదిని పలకరించేందుకు వెళ్లిన రాజు... అక్కడ బావమరిది వద్ద ఎర్రగుడికి చెందిన శేఖర్‌ సెల్‌ఫోన్‌ను గమనించి చూసిస్తానంటూ ఇప్పించుకున్నాడు. అనంతరం బావమరిదిని మాటల్లో పెట్టి ఫోన్‌పే పిన్‌ నంబర్‌ తెలుసుకుని గుట్టుచప్పుడు కాకుండా తన ఫోన్‌పే నంబర్‌కు రూ.30 వేలు బదలాయించాడు. విషయాన్ని గమనించిన బావమరిది, బాధితుడు శేఖర్‌తో పాటు స్థానికులు రాజుకు దేహశుద్ధి చేసి, కాళ్లూచేతులు కట్టి పడేశారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ సురేష్‌, హెడ్‌కానిస్టేబుల్‌ హనుమంతు అక్కడకు చేరుకుని రాజును విడిపించి స్టేషన్‌కు తరలించారు. నిందితుడిని విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement