అనంతపురం కార్పొరేషన్: ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి, ప్రజలకు అండగా నిలిచేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కార్యోన్ముఖులయ్యారు. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి అనుబంధ విభాగాల అధ్యక్షులను నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ఉత్తర్వులు విడుదల చేసింది. యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా సాకే చంద్రశేఖర్ (అనంతపురం అర్బన్), మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలిగా శ్రీదేవి (అనంతపురం అర్బన్), రైతు విభాగం జిల్లా అధ్యక్షుడిగా వై.నారాయణ రెడ్డి(శింగనమల), బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడిగా కురుబ దేవేంద్ర సిజల (ఉరవకొండ), ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడిగా మల్లెమీద నరసింహులు (అనంతపురం అర్బన్), మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడిగా ఎం.సైఫుల్లాబేగ్(అనంతపురం అర్బన్), క్రిస్టియన్ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడిగా వై.ప్రసాద్‌బాబు (గుంతకల్లు), విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడిగా జీ. చంద్రశేఖర్ యాదవ్ (అనంతపురం అర్బన్), పంచాయతీరాజ్ జిల్లా అధ్యక్షుడిగా బీ. యోగేంద్ర రెడ్డి (ఉరవకొండ), మునిసిపల్ వింగ్ జిల్లా అధ్యక్షుడిగా దేవరింటి బోయ సుంకప్ప(గుంతకల్లు),ఆర్‌టీఐ వింగ్ జిల్లా అధ్యక్షుడిగా కే శ్రీనివాస్ రెడ్డి (అనంతపురం అర్బన్), వలంటీర్స్ వింగ్ జిల్లా అధ్యక్షుడిగా ఎం. ధనుంజయ (ఉరవకొండ), గ్రీవెన్స్ సెల్ జిల్లా అధ్యక్షుడిగా బాకే హబీబుల్లా (అనంతపురం అర్బన్), వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడిగా కేఎం. రేవన్న(కళ్యాణదుర్గం), చేనేత విభాగం జిల్లా అధ్యక్షుడిగా సీ.నాగప్ప(రాయదుర్గం), వైఎస్సార్ టీయూసీ జిల్లా అధ్యక్షుడిగా కే. ఓబిరెడ్డి(అనంతపురం అర్బన్), అంగన్‌వాడీ విభాగం జిల్లా అధ్యక్షురాలిగా ఎంసీ. సంధ్యారాణి (కళ్యాణదుర్గం), లీగల్ సెల్ జిల్లా అధ్య క్షుడిగా గాజుల ఉమాపతి (అనంతపురం అర్బన్), దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడిగా ఉపేంద్రగౌడ్ (తాడిపత్రి), కల్చరల్ వింగ్ జిల్లా అధ్యక్షుడిగా బీ.నాగరాజు(అనంతపురం అర్బన్), సోషియల్ మీడియా జిల్లా అధ్యక్షుడిగా వై. నరేంద్రనాథ్ రెడ్డి (అనంతపురం అర్బన్), ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షుడిగా వై.రాజశేఖర్ రెడ్డి (గుంతకల్లు), వైద్యుల విభాగం జిల్లా అధ్యక్షుడిగా జీ.బొమ్మయ్య (కళ్యాణదుర్గం), బూత్ కమిటీ అధ్యక్షుడిగా వై.అమర్‌నాథ్ రెడ్డి (అనంతపురం అర్బన్), ఇంటెలెక్చువల్ విభాగం జిల్లా అధ్యక్షుడిగా పీ. రమేష్‌బాబు(అనంతపురం అర్బన్), పబ్లిసిటీ వింగ్ జిల్లా అధ్యక్షుడిగా జే.విజయభాస్కర్‌రెడ్డి (ఉరవకొండ)ని నియమించారు.
Comments
Please login to add a commentAdd a comment