అనంతపురం: అనంతపురం ఆర్డీటీ స్టేడియం వేదికగా అండర్–19 కూచ్ బెహర్ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం ప్రారంభం కానుంది. ఈ నెల 25న మ్యాచ్ ముగియనుంది. ఉదయం 9.30 గంటలకు ఇన్నింగ్స్ ప్రారంభం కానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, మహా రాష్ట్ర జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే ఇరు రాష్ట్రాల జట్లు అనంతపురంలోని ఆర్డీటీకి చెందిన స్పోర్ట్స్ అకాడమీకి చేరుకుని ప్రాక్టీస్‌లో బిజీగా గడుపుతున్నాయి. మ్యాచ్ నిర్వహణకు సంబంధించి ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకున్నట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సానా సతీష్ బాబు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment