రీ–సర్వేపై అవగాహన తప్పనిసరి
అనంతపురం అర్బన్: భూముల రీ–సర్వేకు సంబంధించి అన్ని అంశాలపై తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ ఆదేశించారు. పైలెట్ ప్రాజెక్టు కింద మండలానికి ఒక గ్రామంగా 31 మండలాల పరిధిలో ఎంపిక చేసిన 31 గ్రామాల్లో రీ–సర్వే త్వరలో ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ తహసీల్దార్లు, సర్వేయర్లు, ఇతర సిబ్బందికి గురువారం కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి సర్వే చేయాల్సి ఉంటుందన్నారు. జాయింట్ ఎల్‌పీఎంలు, భూ విస్తీర్ణం హెచ్చు తగ్గులు తదితర సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలనే దానిపై స్పష్టతతో ఉండాలన్నారు. రీ–సర్వే డిప్యూటీ తహసీల్దార్లు మేజిస్ట్రేట్‌గా ఉంటారని, ఏదేని అంశంపై స్పష్టత లేకపోతే తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని సూచించారు. సంబంధిత అధికారి దృష్టికి ఆ అంశాన్ని తీసుకెళ్లి స్పష్టత పొందిన తరువాతనే ముందుకు వెళ్లాలని ఆదేశించారు. కార్యక్రమంలో సర్వే, భూ రికార్డుల శాఖ ఏడీ రూప్లానాయక్, డిప్యూటీ తహసీల్దార్లు, సర్వేయర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
ప్రతి అంశంపై స్పష్టత కలిగి ఉండాలి
ఎక్కడా చిన్న పొరపాటుకూ తావివ్వకూడదు
జేసీ శివ్‌నారాయణ్ శర్మ ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment