No Headline
●‘ఇల వైకుంఠం’.. స్వామి కటాక్షం
ముక్కోటి ఏకాదశి పర్వదినానికి జిల్లాలోని వైష్ణవాలయాలు సర్వాంగ
సుందరంగా ముస్తాబయ్యాయి. గురువారం అర్ధరాత్రి నుంచే భక్తులు
ఆలయాల వద్ద బారులు తీరారు. భక్తులకు ఇక్కట్లు తలెత్తకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఆ రోజు స్వామి వారిని ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకుంటే పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. అందుకే ఆ రోజు ఆలయాలు భక్తులతో
పోటెత్తుతాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం
Comments
Please login to add a commentAdd a comment