ఇన్‌స్పైర్ కప్ విజేత ‘నర్మద వ్యాలీ’
అనంతపురం: ఇన్‌స్పైర్ కప్ విజేతగా నర్మద వ్యాలీ జట్టు నిలిచింది. అనంతపురం స్పోర్ట్స్ విలేజ్‌లో లాలిగా ఫౌండేషన్ సహకారంతో నిర్వహిస్తున్న ఇన్‌స్పైర్ కప్‌లో గురువారం బెంగళూరు, నర్మద వ్యాలీ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. నర్మదవ్యాలీ మూడు గోల్స్ చేయగా.. బెంగళూరు ఒక గోల్ కూడా చేయక ఓటమి పాలైంది. భారత మాజీ ఫుట్‌బాల్ క్రీడాకారిణి, ఫుట్‌బాల్ కోచ్ అమూల్య కమల్, ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛూ ఫెర్రర్, ఏపీ ఫుట్‌బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు వేణు గోపాల్, యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా రీజి నల్ హెడ్ జితేంద్ర కుమార్ మిశ్రా, ఆర్డీటీ స్పోర్ట్స్ డైరెక్టర్ సాయి కృష్ణ తదితరులు విజేత జట్టుకు ట్రోఫీ అందజేశారు.
● కాగా, 2022 నుంచి ఇన్‌స్పైర్ టోర్నీ నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది టోర్నీలో దేశ వ్యాప్తంగా 12 జట్లు పాల్గొన్నాయి. ఏ– టీం పాయింట్ల పట్టికలో బెంగళూరు జట్టు మొదటి స్థానంలో నిలిచింది. బీ– టీంలో నర్మద వ్యాలీ అగ్రస్థానం సాధించింది. దీంతో ఏ టీంలో మొదటి స్థానంలో ఉన్న బెంగళూరు, బీ–టీంలో మొదటి స్థానంలో ఉన్న నర్మదవ్యాలీ ఫైనల్‌కు చేరాయి. బెంగళూరుపై నర్మదవ్యాలీ విజయం సాధించి ట్రోఫీ అందుకుంది.
Comments
Please login to add a commentAdd a comment