అనంతపురం: నగరంలోని నేషనల్ పార్క్ వద్ద అభిలాష్(28) అనే యువకుడు అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. గతంలో ప్రభుత్వ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేశాడు. ఆదివారం రాత్రి నేషనల్ పార్క్ సమీపంలో తీవ్రంగా కాలిన గాయాలతో మృతి చెంది కనిపించాడు. మృతికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. హత్యా? లేక ఆత్మహత్య అనే అంశంపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముంటున్నట్లుగా తెలిసింది. ఆదివారం ఉదయం నుంచి అభిలాష్ కనపడడం లేదని కుటుంబసభ్యులు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో వారు సెల్‌ఫోన్ ఆధారంగా ఆచూకీ తెలిపారు. దీంతో ఆదివారం రాత్రి కుటుంబ సభ్యులు సెల్‌ఫోన్ లొకేషన్ ఆధారంగా వెళ్లి చూస్తే నేషనల్ పార్క్ సమీపంలో మృతదేహం కనిపించింది. వెంటనే కుటుంబసభ్యులు సమాచారం ఇవ్వడంతో పట్టణ పోలీసులు మల్లగుల్లాలు పడ్డారు. తమ పరిధిలో కాదంటూ తమ పరిధిలో కాదని త్రీ టౌన్, ఫోర్త్ టౌన్, రూరల్ పోలీస్ స్టేషన్ల అధికారులు గంటకు పైగా చర్చించారు. చివరకు మా స్టేషన్ పరిధి కాదని ఒకరు.. మా స్టేషన్ పరిధి కాదని మిన్నకుండిపోయారు.
పత్రికా ప్రతినిధులు ఫోన్ చేయడంతో త్రీటౌన్, ఫోర్త్‌టౌన్ పోలీసులు ఆదివారం రాత్రి ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. కాగా, విషయం తెలిసిన వెంటనే స్పందించకుండా మీనమేషాలు లెక్కిస్తూ వచ్చిన పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి.
కేసు నమోదుకు మీనమేషాలు
లెక్కించిన పోలీసులు
మా పరిధి కాదంటూ జాప్యం
మూడు పీఎస్‌ల అధికారుల వైఖరిపై సర్వత్రా విమర్శలు
చివరకు ఘటనాస్థలాన్ని పరిశీలించిన త్రీటౌన్, ఫోర్త్‌టౌన్ పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment