![ప్రేమ పేరుతో వేధింపులు.. యువతి ఆత్మహత్య](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/09atpc75a-110011_mr-1739131843-0.jpg.webp?itok=DpgVjidR)
ప్రేమ పేరుతో వేధింపులు.. యువతి ఆత్మహత్య
రాప్తాడు రూరల్: తనను ప్రేమించాలంటూ ఓ యువకుడి వేధింపులు తారాస్థాయికి చేరుకోవడంతో మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. బాధిత కుటుంబసభ్యులు తెలిపిన మేరకు... అనంతపురం రూరల్ మండలం ఉప్పరపల్లికి చెందిన దళిత కడప రామచంద్ర, వీరమ్మ దంపతులు స్థానిక ఓ ఇటుకల బట్టీల కూలి పనులతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. రెండో కుమార్తె కడప శిరీష (21) డిగ్రీ చదువుకునే సమయంలో ఉప్పరపల్లికి చెందిన పిన్నదరి వంశీ ప్రేమ పేరుతో వెంటపడేవాడు. శిరీష వారించినా వినేవాడు కాదు. దీంతో తల్లిదండ్రులకు బాధితురాలు తెలపడంతో వారు వంశీని హెచ్చరించారు. అదే సమయంలో విషయాన్ని వంశీ తల్లిదండ్రుల దృష్టికీ తీసుకెళ్లారు. అయినా వంశీలో మార్పు రాలేదు. ప్రేమించాలంటూ వేధింపులు తారాస్థాయికి చేరుకోవడంతో తీవ్ర మనస్థాపం చెందిన శిరీష... ఆదివారం ఉదయం ఆరు బయట నాన్నమ్మ వంట చేస్తుండగా ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 12.30 గంటల సమయంలో ఇంటికి వచ్చిన శిరీష సోదరుడు గమనించి వెంటనే తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు. చుట్టుపక్కల వరాఉ అక్కడకు చేరుకుని శిరీషను కిందికి దించి పరిశీలించారు. అప్పటికే ఆమె మృతి చెందింది. సమాచారం అందుకున్న ఇటుకలపల్లి పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. వంశీ కారణంగానే శిరీష మృతి చెందిందంటూ బాధితులు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా వారి వెంట ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి నాయకులు రామకృష్ణ, మారెప్ప, ఓబుళపతి, సూరి, స్వామి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment