బాలికల శిక్షణకు
దరఖాస్తుల ఆహ్వానం
అనంతపురం ఎడ్యుకేషన్: ‘రాణి లక్ష్మీబాయి ఆత్మరక్ష పరిశీలన– ఆత్మరక్షణ’ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్యాల పాఠశాలల్లో 6,7,8,9 తరగతుల విద్యార్థినులకు శిక్షణ ఇచ్చేందుకు అర్హత కల్గిన సంస్థలు దరఖాస్తు చేసుకోవాలని సమగ్రశిక్ష ఏపీసీ టి.శైలజ సూచించారు. ఈ మేరకు సోమవారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6,7,8 తరగతుల విద్యార్థినులు 4,238 మంది, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, మునిసిపల్ పాఠశాలలు, సాంఘిక సంక్షేమ పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, గిరిజన సంక్షేమ పాఠశాలలు, హై స్కూల్‌ప్లస్ స్కూళ్లల్లో 6–9 తరగతుల విద్యార్థినులు 42,555 మంది ఉన్నారన్నారు. వీరందరికీ ‘రాణి లక్ష్మీబాయి ఆత్మపరిశీలన–ఆత్మ రక్షణ ప్రషిక్షణ’ (స్వీయ రక్షణ) పథకం కింద కరాటే, తైక్వాండో తదితర స్వీయరక్షణ కళల్లో శిక్షణ ఇచ్చేందుకు రిజిస్టర్ అయిన సంస్థలు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆయా సంస్థలకు కనీసం మూడేళ్లు అనుభవం ఉండాలన్నారు. నేటి నుంచి 13వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు సమగ్రశిక్ష కార్యాలయంలో అందజేయాలని సూచించారు. మరిన్ని వివరాలకు నేరుగా కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.
రైతులకు ఐడీ నంబర్లు
అనంతపురం సెంట్రల్: ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టాదారు పాసు పుస్తకం కలిగిన ప్రతి రైతుకూ ఒక కొత్త ఐడీ నంబర్ కేటాయిస్తున్నట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారి(జేడీఏ) ఉమామహేశ్వరమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. పంట నమోదు, పీఎం కిసాన్, ఇన్‌పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్, రాయితీ పనిముట్లు, రాయితీ విత్తనం, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో పంట ఉత్పత్తుల అమ్మకాలు తదితర వాటికి ఈ ఐడీ కీలకమని వివరించారు. ప్రతి రైతూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడెంటిఫికేషన్ నంబర్ కలిగి ఉండాలని సూచించారు. పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్‌కార్డు అనుసంధానమైన ఫోన్ నంబర్‌తో రైతు సేవా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment