![వైభవంగా జలధి ఉత్సవం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10mdks402a-110074_mr-1739212712-0.jpg.webp?itok=yuk7VHV-)
వైభవంగా జలధి ఉత్సవం
అమరాపురం: మండలంలోని గౌడనకుంట గ్రామంలో వెలసిన కెంచమాంబదేవి జలధి ఉత్సవం సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. తెల్లవారుజామునే అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులు, గ్రామస్తులతో కలిసి ఉత్సవ విగ్రహాన్ని బంగారు పాళ్యం సమీపంలోని వంకవద్దకు తీసుకెళ్లి గంగాజలంతో శుద్ధి చేశారు. ప్రత్యేక పూజల అనంతరం అమ్మ వారికి 101 వడలు వేసి గ్రామంలోని అన్ని కులాల వారికి ప్రసాదంగా అందజేశారు. జిల్లా నుంచే కాక కర్ణాటక ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో గౌడనకుంట జనసంద్రమైంది. సాయంకాలం ఉత్సవ విగ్రహాన్ని డప్పు వాయిద్యాలతో ఆలయానికి తిరిగి చేర్చారు. అంతకుముందు కాడెద్దులను నూతనంగా తయారు చేయించిన ఇనుప బండికి కట్టి లాగుడు పోటీలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment