![అంతా](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10atpc205-600515_mr-1739212751-0.jpg.webp?itok=cVyqhJVP)
అంతా మాదే.. అన్నీ మాకే
అనంతపురం: కల్లు గీత కులాల కుటుంబాలకు 10 శాతం మద్యం దుకాణాలు కేటాయిస్తున్నామని గొప్పలు చెప్పుకున్న చంద్రబాబు ప్రభుత్వం.. ఆచరణలో మాత్రం షాపులన్నీ తమ పార్టీ ‘సిండికేట్’కే అప్పగించింది. గతంలోనూ నానా రభస చేసి, టెండర్ దక్కించుకున్న వారిని భయభ్రాంతు లకు గురి చేసి ప్రైవేట్ మద్యం దుకాణాలను గుప్పిట పట్టిన టీడీపీ మాఫియా.. తాజాగా కల్లుగీత కులాలకు కేటాయించిన దుకాణాలను సైతం అదే రీతిలో చేజిక్కుంచుకుంది. జిల్లాలో 14 మద్యం షాపులను కల్లు గీత కులాలకు కేటాయించారు. మొత్తం 63 దరఖాస్తులు అందగా.. సోమవారం అనంతపురం జెడ్పీ ఆవరణలో లాటరీ ప్రక్రియ నిర్వహించారు. అయితే, సింహభాగం మద్యం షాపులు టీడీపీ నాయకులే దక్కించుకున్నారు. ముందుగానే సిండికేట్‌గా ఏర్పడి ఇతరులు దరఖాస్తు చేయకుండా అడ్డుకున్న నాయకులు.. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన వారిని సైతం టెండర్ల సందర్భంగా అడ్డుకుని హస్తగతం చేసుకోవడం విమర్శలకు తావిచ్చింది.
ఎమ్మెల్యే అనుచరుడి హల్‌చల్..
టెండర్ సందర్భంగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ముఖ్య అనుచరుడు కోనంకి గంగారామ్ రెచ్చిపోయాడు. టెండర్ దక్కించుకున్న సురేంద్ర కుమార్ అనే వ్యక్తిని బహిరంగంగానే బెదిరించాడు. లాటరీలో టెండర్ దక్కించుకున్న తక్షణమే సురేంద్ర చుట్టూ ఎమ్మెల్యే అనుచరులు చేరారు. ఈ క్రమంలోనే సాక్షాత్తు పోలీసుల ముందే సురేంద్రను గంగారామ్ బెదిరించాడు. కిడ్నాప్ చేసేందుకు విఫలయత్నం చేశాడు. సురేంద్ర వినకపోవడంతో ఎకై ్సజ్ అధికారులపై ఒత్తిడి తెచ్చాడు. దీంతో లైసెన్స్ సొమ్ము కట్టించుకోలేదు. ఇందుకు 24 గంటల సమయం ఉందని అధికారులు సురేంద్రకు ఉచిత సలహా ఇచ్చారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే ఇంటికి సురేంద్ర వెళ్లి రాగా, వెంటనే డబ్బు కట్టించుకోవడం గమనార్హం. షాపు లైసెన్స్ మాత్రం కల్లు గీత కార్మికుడిది.. లాభం మాత్రం అధికారంలో ఉన్న తమకు దక్కేలా సెటిల్‌మెంట్ చేసుకున్నట్లు తెలిసింది.
‘కల్లు గీత’ మద్యం షాపులపై టీడీపీ సిండికేట్ పడగ
‘అనంత’లో టెండర్ దక్కించుకున్న వ్యక్తికి బెదిరింపులు
![అంతా మాదే.. అన్నీ మాకే 1](https://www.sakshi.com/gallery_images/2025/02/11/10atpc207-600515_mr-1739212751-1.jpg)
అంతా మాదే.. అన్నీ మాకే
Comments
Please login to add a commentAdd a comment