డిసెంబర్‌ 14 నుంచి 6, 7 తరగతులు | School Education Department Orders On 6th And 7th Classes Start | Sakshi
Sakshi News home page

డిసెంబర్‌ 14 నుంచి 6, 7 తరగతులు

Published Tue, Nov 24 2020 4:40 AM | Last Updated on Tue, Nov 24 2020 4:40 AM

School Education Department Orders On 6th And 7th Classes Start - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని స్కూళ్లలో తరగతుల ప్రారంభంపై ఇంతకు ముందు ఇచ్చిన జీవోకు స్వల్ప సవరణలు చేస్తూ పాఠశాల విద్యాశాఖ సోమవారం జీవో 229 విడుదల చేసింది. కోవిడ్‌ నేపథ్యంలో స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ను పాటిస్తూ తరగతులు నిర్వహించేందుకు పాఠశాలల్లో తగినంత స్థలం అందుబాటులో లేనందున ఈ సవరణ చేస్తున్నట్లు ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తాజా జీవో ప్రకారం డిసెంబర్‌ 14వ తేదీ నుంచి అన్ని యాజమాన్యాల్లోని స్కూళ్లలో 6, 7 తరగతులను ప్రారంభించనున్నారు. సంక్రాంతి అనంతరం పరిస్థితిని అనుసరించి 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు తరగతులు ప్రారంభించనున్నారు. సూళ్లను ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు నిర్వహించనున్నారు.

అధిక సంఖ్యలో 8వ తరగతి విద్యార్థులు హాజరు
రాష్ట్రంలోని పాఠశాలల్లో 8వ తరగతి విద్యార్థులకు క్లాసులు ప్రారంభించిన తొలిరోజే అత్యధిక సంఖ్యలో హాజరయ్యారని విద్యాశాఖ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ వెల్లడించారు. ఈ నెల 2 నుంచి ఇప్పటి వరకు 9, 10 తరగతులకు బోధన జరిగింది. సోమవారం 8వ తరగతి విద్యార్థుల తరగతులు ప్రారంభించారు. 46.28 శాతం 10వ తరగతి విద్యార్థులు, 41.61 శాతం 9వ తరగతి విద్యార్థులు హాజరయ్యారు. 8వ తరగతి విద్యార్థులు అత్యధికంగా 69.72 శాతం హాజరయ్యారు. మొత్తం 5,70,742 మంది విద్యార్థులకు గాను 3,96,809 మంది హాజరయ్యారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement