డ్రాగా ముగిసిన మ్యాచ్‌లు
కడప స్పోర్ట్స్ : కడప నగరంలో నిర్వహిస్తున్న ఏసీఏ అంతర్ జిల్లాల అండర్–14 క్రికెట్ పోటీల్లో తొలి దశ మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. వైఎస్‌ఆర్‌ఆర్–ఏసీఏ మైదానంలో నిర్వహించిన మ్యాచ్‌లో బుధవారం బ్యాటింగ్‌కు దిగిన విజయనగరం జట్టు 70.5 ఓవర్లలో 165 పరుగులకే ఆలౌట్ అయింది. జట్టులోని బాబా 42, జస్టిన్ 29 పరుగులు చేశారు. శ్రీకాకుళం బౌలర్లు సాత్విక్ 4, వివేక్‌నంద 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీకాకుళం జట్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి 19 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. జట్టులోని కృష్ణ కౌశల్ 37, జోషిత్ 17 పరుగులు చేశారు. విజయనగరం బౌలర్ సాత్విక్ 2 వికెట్లు తీశాడు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీకాకుళం జట్టు 336 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో శ్రీకాకుళం జట్టుకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.
కృష్ణా జట్టుకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం..
కేఎస్‌ఆర్‌ఎం మైదానంలో నిర్వహించిన మ్యాచ్‌లో 80 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బరిలోకి దిగిన కృష్ణా జట్టు 80.2 ఓవర్లలో 249 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. జట్టులోని భానుచంద్ యాదవ్ 78 పరుగులు, భానుచైతన్య 36 పరుగులు చేశారు. గుంటూరు బౌలర్లు గోపీచంద్ 4, అబ్దుల్ 2, ఖాదర్ 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన గుంటూరు జట్టు 38 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. జట్టులోని కౌషిక్ 69, రామ్‌చరణ 60 పరుగులు చేశారు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. కాగా తొలి ఇన్నింగ్స్‌లో గుంటూరు జట్టు 152 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో కృష్ణా జట్టుకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.
నెల్లూరుకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం
కేఓఆర్‌ఎం మైదానంలో నిర్వహించిన మ్యాచ్‌లో 108 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో బరిలోకి దిగిన అనంతపురం జట్టు 54.5 ఓవర్లలో 190 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. జట్టులోని ఆదినారాయణరెడ్డి 83 పరుగులు, రోహిత్ రాయల్ 20 పరుగులు చేశారు. నెల్లూరు బౌలర్లు లీలావికాస్ 3, సాకేత్ 5, సుశాంత్ 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన నెల్లూరు జట్టు 52.4 ఓవర్లలో 175 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. జట్టులోని కిన్ను కిషాల్ 67, సాయియశ్వంత్ 53 పరుగులు చేశారు. అనంత బౌలర్లు కిరణ్‌కుమార్ 4, లిఖిత్ 3, దేవస్కందారెడ్డి 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన అనంత జట్టు ఆట ముగిసే సమయానికి 14 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. కాగా నెల్లూరు జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 264 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో నెల్లూరు జట్టుకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.
Comments
Please login to add a commentAdd a comment