ఘనంగా ఉరుసు ఉత్సవం
కలకడ : మండలంలోని కలకడ ఇందిరమ్మ కాలనీలోని మాసుంవలియా షహీద్ స్వాముల దర్గా వద్ద ఉరుసు ఉత్సవం ఘనంగా నిర్వహించారు. దర్గా పెద్ద అన్వర్ బాషా ఆధ్వర్యంలో కలిచెర్లకు చెందిన యూసఫ్ హుసైనీ, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఉమర్ దరాజ్, కర్ణాటకు చెందిన తహసీన్ తాజ్ ఖవ్వాలీ పాటలతో అలరించారు. వివిధ మండలాల నుంచి ముస్లింలు హాజరై వీక్షించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు అన్నదానం చేశారు.
మల్లయ్యకొండకు రూ.5.94 లక్షల ఆదాయం
తంబళ్లపల్లె : మల్లయ్యకొండపై వెలసిన భ్రమరాంబిక సమేత మల్లికార్జునస్వామి ఆలయంలో హుండీలను బుధవారం లెక్కించారు. రూ.5,94,257 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఇన్స్‌పెక్టర్ శశికుమార్, ఈఓ మునిరాజ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈశ్వరప్ప, మల్లికార్జున, శంకర, కొండకిట్ట పాల్గొన్నారు.
సారా ఊట ధ్వంసం
పీలేరు : వాల్మీకిపురం మండలం ఎగువమేకలవారిపల్లెలో తయారీకి సిద్ధంగా ఉంచిన 2300 లీటర్ల సారా ఊటను ధ్వంసం చేసినట్లు సీఐ ప్రసాద్‌బాబు తెలిపారు. అనంతరం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, ఏఆర్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment