గుర్తు తెలియని వ్యక్తి మృతి
మదనపల్లె : మదనపల్లి టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గొల్లపల్లి సచివాలయం రోడ్డు పక్కన ఓ వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తి అతిగా మద్యం తాగి మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. మృతుడు ముదురు నీలపుచుక్కల చొక్కా ధరించారు. ఆయన వయస్సు సుమారు 40–45 మధ్య ఉంది. అనంతరం మృతదేహాన్ని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు.
జీఎంఆర్ పాలిటెక్నిక్‌లో జాబ్‌మేళా
మదనపల్లె సిటీ : స్థానిక జీఎంఆర్ పాలిటెక్నిక్‌లో బుధవారం స్కిల్ డెవలప్‌మెంట్, సిడాప్, జిల్లా ఉపాధి కల్పనాశాఖ సంయుక్తంగా జాబ్ మేళా నిర్వహించాయి. నాలుగు కంపెనీ ప్రతినిధులు హాజరై 11 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేసినట్లు ప్లేస్‌మెంట్ ఆఫీసర్ వెంకటేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఓబులేసు, సిబ్బంది పాల్గొన్నారు.
దొంగ అరెస్టు
ఓబులవారిపల్లె : మంగంపేట జాతీయ రహదారిపై ఇనుప వస్తువులను చోరీ చేసిన గొల్ల జగదీష్ బుధవారం అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ పి.మహేష్ తెలిపారు. మంగంపేట జాతీయ రహదారిపై చెన్నకేశవస్వామి ఆలయం సమీపంలో పల్వ రైజింగ్ మిల్లులో ఉపయోగించే రోలర్ బుష్ రాడ్లను సంచిలో తీసుకెళ్తుండగా పట్టుకున్నట్లు వారు తెలిపారు. వాటి విలువ రూ.44వేలు ఉంటుందని ఎస్‌ఐ తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment