విద్యుత్ షాక్‌తో రైతు మృతి
కురబలకోట : విద్యుత్ షాక్‌తో ఓ రైతు మృతి చెందిన విచారకర సంఘటన బుధవారం కురబలకోట మండలంలో చోటుచేసుకుంది. ముదివేడు పోలీసుల కథనం మేరకు.. మండలంలోని కనసానివారిపల్లెకు చెందిన రైతు గాండ్లపెంట రెడ్డెప్పరెడ్డి (45) బుధవారం కమతంపల్లెకు చెందిన ఓ రైతు పొలం దున్నడానికి మల్లేలగడ్డ వద్దకు ట్రాక్టర్ తీసుకెళ్లాడు. అక్కడ పొలం దున్నుతుండగా ట్రాక్టర్ మడక తగిలిచిన్నపాటి విద్యుత్తు స్తంభం పడిపోయింది. విద్యుత్తు ఉందని గమనించకుండా కింద పడిన తీగ పైకి లాగి కట్టాలని చెట్టెక్కాడు. లాగే క్రమంలో పైన విద్యుత్ లైన్‌కు తీగ తగిలి షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. ఇతడికి భార్య శకుంతల, కమారులు హితేష్‌రెడ్డి, రుత్విక్ రెడ్డి ఉన్నారు. కుటుంబ పెద్ద మృతి చెందడంతో ఆ కుటుంబం రోధించిన తీరు అందరినీ కలచివేసింది. ఎస్‌ఐ దిలీప్‌కుమార్, ట్రాన్స్‌కో డీఈ గంగాధర్, ఏడి సురేంద్ర నాయక్, ఏఈ శంకర్‌రెడి్‌డ్ సంఘటనా స్థలం పరిశీలించారు. జరిగిన సంఘటనపై ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు తెలిపారు.
కుటుంబ పెద్దను కోల్పోయిన కుటుంబం
Comments
Please login to add a commentAdd a comment