అటవీ పరిధిలో స్మగ్లర్ల అరెస్టు
కడప అర్బన్ : బద్వేల్ అటవీ ప్రాంతం పరిధిలో ఏడుగురు స్మగ్లర్లను అటవీ అధికారులు అరెస్టు చేశారు. కడప డీఫ్‌ఓ కార్యాలయంలో విలేకరులకు డీఎఫ్‌ఓ వినీత్‌కుమార్ వివరాలు వెల్లడించారు. బద్వేల్ అటవీ రేంజ్‌లోని బ్రాహ్మణపల్లి సెక్షన్, బోయినపల్లి బీట్ పరిధిలో వన్యప్రాణి పెంగోలిన్(అలుగు)ను తరలిస్తున్న సమాచారం అందిందని తెలిపారు. దాడులు చేసి గోపవరం మండలానికి చెందిన రామిరెడ్డి, పాలెంకు చెందిన రాగి శ్రీను, బద్వేల్ మండలం లక్ష్మీపాలెం గ్రామానికి చెందిన పాలగిరి పెంచలయ్య, నెల్లూరు జిల్లా వింజమూరు గ్రామానికి చెందిన లెక్కల శివారెడ్డి, మర్రిపాడుకు చెందిన వెంకటాద్రి, వింజమూరుకు చెందిన ఓంకారం బాబులను అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి నుంచి అలుగు, ఆటో, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఎర్రచందనం దుంగలు పట్టివేత
బ్రాహ్మణపల్లి బీట్ పరిధిలో ఎర్రచందనం రవాణా చేస్తున్న కాశినాయన మండలం నారాయణపల్లె గ్రామానికి చెందిన రాంబాబు, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం అహోబిలం గ్రామానికి చెందిన తురక సుబ్బరాయుడులను అరెస్టు చేసి వారి నుంచి 109 కిలోల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామన్నారు. వారి అరెస్ట్ చేయడంలో కృషిచేసిన అధికారులు బి.స్వామి వివేకానంద, కె.వెంకటశేషయ్య, ఎస్‌ఎస్.ఖాజావలి, ఎం.పుష్పరాజ్, సి.విజయలక్ష్మి, ఎం.సువర్ణకుమార్, పి.రాజేష్‌రెడ్డి, ఎల్.లక్ష్మీనరసమ్మ, ఎస్‌డీ. మునాఫ్, ఎస్.అక్బర్‌షరీఫ్, సిబ్బందిని డీఎఫ్‌ఓ వినీత్‌కుమార్ అభినందించారు. స్వాధీనం చేసుకున్న పెంగోలిన్(అలుగు)కు వెటర్నరీ డాక్టర్ చే పరీక్షలు చేయించి, అటవీ ప్రదేశంలోనే సురక్షితంగా వదిలివేస్తామని డీఎఫ్‌ఓ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment