రాష్ట్ర ఉత్తమ అధ్యాపకులకు సత్కారం
వైవీయూ : యోగివేమన విశ్వవిద్యాలయం ఆచార్యులు ఎల్. వీరాంజనేయరెడ్డి (మైక్రోబయాలజీ), ఆచార్య జి. విజయభారతి (కామర్స్), ఎం. అనిత( ఎకనామిక్స్)లను వైస్ చాన్సలర్ ఆచార్య కె. కృష్ణారెడ్డి, ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్. రఘునాథరెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య పి.పద్మ ఘనంగా సత్కరించారు. వైవీయూలో శనివారం రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతల అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ ఆచార్య కె. కృష్ణారెడ్డి మాట్లాడుతూ అవార్డు గ్రహీతలైన ఎల్. వీరాంజనేయరెడ్డి దేశంలోని టాప్–2 సైంటిస్టులలో ఒకరిని, డీఎస్‌టీ, ఫిస్ట్, యూజీసీ ప్రాజెక్టులు పొంది పరిశోధనల్లో ముందుకు వెళుతున్నారని అభినందించారు. ఆచార్య అనిత సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి కావడం చేత సహజంగానే పరిశోధనలో ముందున్నారన్నారు. ఆచార్య జి. విజయభారతి అకడమిక్‌గా, పరిశోధనలపరంగా కార్యక్రమాల పరంగా అభివృద్ధి పథంలో ముందున్నారని తెలిపారు. ఇక్కడే చదివి, ప్రొఫెసర్‌గా బెస్ట్ టీచర్ పురస్కారం అందుకోవడం ప్రశంసనీయమన్నారు. ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్. రఘునాథ్‌రెడ్డి మాట్లాడుతూ వచ్చే యేడాది మరిన్ని అవార్డులు రావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పలువురు అధ్యాపకులు పాల్గొని అవార్డు గ్రహీతలను అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment