ఇంటి స్థలాలు మంజూరు చేయాలని సచివాలయం ముట్టడి
ఓబులవారిపల్లె : మండలంలోని ఇళ్లులేని నిరుపేదలకు ఇంటి స్థలాలు, నిర్మాణ సామగ్నిని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం వైకోటలో సీపీఐ, బీకేఎంయూ నాయకులు సచివాలయం ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీకేఎంయూ నియోజకవర్గ నాయకులు ఎం జయరామయ్య మాట్లాడుతూ మండలంలో దళితులు, గిరిజనులు, బీసీలు, క్రిస్టియన్లు, మైనార్టీలు వేలాది మంది ఇళ్లులేనివారు ఉన్నారన్నారు. ఒకే ఇంట్లో రెండు, మూడు కుటుంబాలు ఉన్నాయని, వారు అతికష్టం మీద జీవనం సాగిస్తున్నారన్నారు. కూలి పనులు చేసుకునే పేదలను గుర్తించి వారికి ఇంటి స్థలంతోపాటు ఇంటి నిర్మాణ సామగ్రిని పంపిణీ చేయాలన్నారు. కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు ఒకరికి కూడా ఇంటిస్థలం మంజూరు చేయలేదని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో డీహెచ్‌పీఎస్ మండల కార్యదర్శి కటారి గోపాల్, ఎం రాజేశ్వరీ, కె సుకన్య, మస్తాన్, జిలానీ, రమణయ్య, పేద మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment