పులివెందుల రూరల్ : వరకట్నం వేధింపుల కేసులో నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 3.09 లక్షల జరిమానా విధిస్తూ సోమవారం అదనపు సీనియర్ సివిల్ జడ్జి కే. ప్రత్యుషా కుమారి తీర్పునిచ్చారు. వివరాలిలా.. పట్టణంలోని జెండామాను వీధిలో ఉంటున్న గూడుబాయి అల్లాబకాష్ కుమార్తె రేష్మాను స్థానక అదే వీధికి చెందిన షేక్ మహబూబ్ బాషా కుమారుడు మహమ్మద్ రఫీకి ఇచ్చి 2008లో వివాహం చేశాడు. కట్నం కింద 22 తులాల బంగారం, రెండు లక్షల రూపాయలు నగదు ఇచ్చి వివాహం చేశారు. కొంత కాలం భార్యభర్తలు సంతోషంగా ఉన్నారు. వారికి ముగ్గురు పిల్లలు. ఆ తరువాత భర్త తాగుడుకు బానిపై అదనపు కట్నం కోసం భార్యను వేధించడం, మానసిక క్షోభకు గురిచేస్తున్నాడు. విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో కూతురి కాపురం బాగుండాలని 3 లక్షల అదనపు కట్నం ఇచ్చారు. అయినా భర్త, అత్తమామల వేధింపులు ఆగలేదు. దీంతో రేష్మా 01.02.2018న రాత్రి తల్లిదండ్రులకు ఫోన్ చేసి భర్త, అత్తమమాలు కొడుతూ వేధిస్తున్నారు. తాను చనిపోతున్నాని చెప్పిందన్నారు. ఆ రాత్రి రాత్రి 11 గంటలకు ఉరి వేసుకుని రేష్మా చనిపోయింది. మృతురాలి సోదరుడు హబీబుల్లా ఫిర్యాదు మేరకు అప్పట్లో కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేశారు. కేసు పూర్వాపరాలు కోర్టుకు సమర్పించారు. ఈ కేసును విచారించిన అడిషనల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కోర్టు అదనపు సీనియర్ సివిల్ జడ్జి కే. ప్రత్యుషా కుమారి నేరం రుజువు కావడంతో నిందితుడు మహమ్మద్ రఫీ (38)కి ఐదు సంవత్సరాల సాధారణ జైలు శిక్ష, రూ.3.09లక్షల జరిమానా విధించారు. సాకా్‌ాష్ధరాలతో నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీస్ అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు అభినందించారు.
రూ.3.09 లక్షల జరిమానా
నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన సిబ్బందికి ఎస్పీ అభినందనలు
Comments
Please login to add a commentAdd a comment