పెన్షనర్ల సమస్యలను సత్వరమే పరిష్కరించాలి
కడప కోటిరెడ్డిసర్కిల్ : పెన్షనర్ల న్యాయబద్ధమైన సమస్యలను పరిష్కరించి ఆయా కుటుంబాలను అన్ని విధాల ఆదుకోవాలని పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం కడపలోని పీఎఫ్ కార్యాలయం వద్ద పెన్షనర్లు విద్రోహ దినం పాటించారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఇపీఎస్ పెన్షనర్స్‌కు పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా కనీస పెన్షన్ రూ. 9000గా నిర్ణయించాలని సుదీర్ఘకాలంగా డిమాండ్ చేస్తున్నా పట్టించుకోక పోవడం తగదన్నారు. ఇపీఎస్ పెన్షనర్లకు పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహారించడం సరికాదన్నారు. నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి అన్ని వర్గాల ప్రజలపై భారాలు మోపుతున్నాయన్నారు. నిత్యాసర వస్తువుల ధరలు మొదలుకొని గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో ఈపీఎస్ పెన్షనర్స్‌కు వెయ్యి రూపాయలు పెన్షన్ ఇస్తే ఏ రకంగా బతుకుతారని ప్రశ్నించారు. ధరలు పెంచిన ప్రభుత్వం పెన్షన్ పెంచాల్సిన బాధ్యత లేదా అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పెన్షనర్ దారులకు ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయని, ఈఎస్‌ఐ, ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. పెన్షనర్లకు గతంలో రైల్వేలో రాయితీలు ఇచ్చే వారిని ఇప్పుడు రద్దు చేయడం అన్యాయమన్నారు. పెన్షనర్స్ సమస్యలపై గతంలో హైపవర్ కమిటీ వేశారని, దానిని బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. పెన్షనర్ల సమస్యలపై ఫిబ్రవరిలో ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలకు శ్రీకారం చుడుతున్నట్లు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నిరసన కార్యక్రమంలో వామపక్ష కార్మిక సంఘాల నాయకులు శ్రీనివాసులురెడ్డి, మనోహర్, నాగ సుబ్బారెడి,్డ బిఎస్‌ఎన్‌ఎల్ ఎంప్లాయిస్ నాయకులు కళ్యా సుధాకర్, విద్యుత్ కార్మిక సంఘం నాయకులు సుదర్శన్‌రెడ్డి, యూటీఎఫ్ టీచర్స్ నాయకులు లక్ష్మీరాజా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment